తుదివిడుత ప్రశాంతం


Wed,May 15, 2019 02:50 AM

Third phase of local polls record 77.41 Percentage

- పరిషత్ పోరులో.. పల్లెల్లో వెల్లివిరిసిన ఓటు చైతన్యం
- 77.81% పోలింగ్ l మూడు విడుతల్లో సగటున 77.41% నమోదు


హైదరాబాద్, నమస్తే తెలంగాణ:పరిషత్ మూడో విడుత పోలింగ్‌లో ఓటుచైతన్యం వెల్లివిరిసింది. మొదటి, రెండు విడుతల కంటే తుదివిడుతలో అధికశాతం పోలింగ్ నమోదయింది. మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మూడోవిడుత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడుతలో 27 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 77.81 శాతం పోలింగ్ నమోదయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 88.40 శాతం.. నారాయణపేట జిల్లాలో అతి తక్కువగా 68.53 శాతం పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మూడువిడుతల్లో కలిపి సగటున 77.41 శాతం పోలింగ్ నమోదయింది. మూడోవిడుతలో 27 జిల్లాల్లోని 161 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ జెడ్పీటీసీగా కోవ లక్ష్మి ఏకగ్రీవమవడంతో 160 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 741 మంది పోటీపడ్డారు. 1,738 ఎంపీటీసీ స్థానాల్లో 30 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1,708 స్థానాలతోపాటు, తొలివిడుతలో పోలింగ్ వాయిదాపడిన సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్
voters1
స్థానాలకు కలుపుకుని మొత్తం 1,710 ఎంపీటీసీలకు మంగళవారం పోలింగ్ నిర్వహించారు. 9,494 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.తీవ్రవాద ప్రభావిత 205 కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగించగా.. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.

పోలింగ్‌కు భారీభద్రత

ప్రశాంతంగా ఓటుహక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లుచేసింది. పోలీసులు 144 సెక్షన్ అమలుచేశారు. వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. పోలింగ్‌కేంద్రా ల వద్ద తాగునీటి వసతితోపాటు, ప్రాథమిక వైద్యశిబిరాలు, ఎండ నుంచి ఉపశమనానికి షామినాయాలను ఏర్పాటుచేశారు. తుదివిడుతలో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచి బారులు తీరారు. ఉదయం 9 గంటలకు 19.31 శాతం పోలింగ్ నమోదు కాగా.. 11 గంటల వరకు 43.51 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 61.23 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 70.05 శాతం పోలింగ్ నమోదైంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో వర్షం కారణంగా కొద్దిసేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. మూడోవిడుతలో పలువురు ప్రముఖు లు ఓటువేశారు. నిజామాబాద్ జిల్లా వే ల్పూరు మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వల్లూరులో ఓటేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య ఓటేశారు.

ఎన్నికల విధుల్లో ఉద్యోగికి గుండెపోటు

వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం చించల్‌పేట 68వ పోలింగ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగి వెంకటయ్యకు గుండెనొప్పితో అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే వికారాబాద్ దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని కామినేని వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు.

బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

నవాబుపేట మండల పరిధిలోని పులుమామిడి ఎంపీటీసీ అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసిన శారద కుటుంబ సభ్యులతో ఎన్నికలకు సంబంధించి స్వల్పంగా గొడవపడి మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పరిసిస్థితి విషమించడంతో సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
voters2

1007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles