రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రజా ఫిర్యాదుల బాక్స్

Sat,November 9, 2019 01:13 AM

-వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి తలసాని

బన్సీలాల్‌పేట్: పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని పద్మారావునగర్ పార్క్ వద్ద ప్రజా సమస్యల ఫిర్యాదుల పెట్టెను శుక్రవారం ప్రారంభించారు. సమస్య మీది-పరిష్కారం మాది పేరిట రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పక్షం రోజులకోసారి ఫిర్యాదుల బాక్స్ తెరిచి అందులో ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీకి సంబంధించిన రోడ్లు, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, బోరింగులు, విద్యుత్, రెవెన్యూ, ట్రాఫిక్, శాంతిభద్రతలు తదితర సమస్యలను పూర్తి వివరాలతో తెల్లకాగితంపై రాసి ఈ పెట్టెలో వేయాలని సూ చించారు. వ్యక్తిగతమైన సమస్యలు ఇందులో వేయవద్దని కోరారు. కార్యక్రమంలో బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే హేమలత, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ శంకరయ్య పాల్గొన్నారు.

401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles