నేడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

Thu,October 10, 2019 02:11 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణాబేసిన్‌లో తెలుగు రాష్ర్టాల నీటి వినియోగం లెక్కల్ని తేల్చేందుకు కృష్ణాబోర్డు రెండురాష్ర్టాల ఇంజినీర్లతో సమావేశం కానుంది. ఈ మేరకు గురువారం జలసౌధలోని బోర్డు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు రెండు రాష్ర్టాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి ఇండెంట్లు సమర్పించడం, బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేయడం.. అవసరానికి అనుగుణంగా రాష్ర్టా లు నీటిని వినియోగించుకుంటున్నాయి. అయితే ఏ ప్రాజెక్టు నుంచి ఎంతమేర వాడుకున్నారు? ముఖ్యంగా వాస్తవ డిశ్చార్జి, అధికారిక లెక్కల్లో నమోదవుతున్న వాటి మధ్య తేడా ఎందుకొస్తుంది? అనే అంశాలపై చర్చించనున్నారు.

162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles