మొక్కలునాటిన నటి జయసుధ

Sat,November 9, 2019 01:24 AM

-మరో ముగ్గురికి గ్రీన్‌చాలెంజ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని మొక్కలు నాటడం ప్రారంభిస్తే త్వరలోనే హరిత తెలంగాణ సాధ్యమవుతుందని సినీనటి జయసుధ పేర్కొన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఇచ్చిన గ్రీన్‌చాలెంజ్‌ను స్వీకరించిన జయసుధ.. శుక్రవారం నార్సింగిలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం ఆమె సినీహీరోలు మోహన్‌బాబు, మురళీమోహన్, యాంకర్ సుమకు గ్రీన్‌చాలెంజ్ విసిరారు. కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. గ్రీన్‌చాలెంజ్‌లో ఇప్పటికే మూడు కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు.

సిడ్నీలో గ్రీన్‌చాలెంజ్

గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా సిడ్నీలో మొక్కలు నాటినట్టు టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహేశ్ బిగాల ద్వారా సిడ్నీలో రాజేశ్‌గిరి రాపోలు ఆధ్వర్యంలో మొక్కలు నాటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూ ఇంచార్జి ప్రవీణ్ పిన్నమ, సరళకుమారి, జ్యోతి వడ్రేపు, స్వాతి నల్లాన్, రవి దూపాటి, లక్ష్మణాచార్యులు నల్లాన్, పరశురాం మొతుకుల, జస్వంత్ కొడరపు, సాంబశివారెడ్డి పాల్గొన్నారు.

106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles