మున్సిపల్ విజయమే లక్ష్యం


Thu,September 12, 2019 04:06 AM

TRS aiming at big win in coming municipal polls

-నేతలంతా సమన్వయంతో పనిచేయాలి
-దేశంలో బలమైన పార్టీగా టీఆర్‌ఎస్
-త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు
-పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో భేటీ
-టీఆర్‌ఎస్ కమిటీల ఏర్పాటుపై సమీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సుమారు అరవై లక్షలమంది కార్యకర్తలతో దేశంలోనే బలమైన పార్టీల్లో ఒకటిగా టీఆర్‌ఎస్ నిలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలమేరకు బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ కమిటీల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు స్థానిక పార్టీశ్రేణులతో సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీ కార్యదర్శులు మున్సిపాలిటీలవారీగా స్థానిక పరిస్థితులను కేటీఆర్‌కు వివరించారు.

జిల్లాలవారీగా పార్టీ కమిటీల ఏర్పాటుపై కేటీఆర్ వారితో చర్చించారు. త్వరలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేస్తామని చెప్పారు. రాష్ట్రకమిటీలో ఉండి మంత్రి అయిన సత్యవతిరాథోడ్, శాసనమండలిలో చీఫ్‌విప్‌గా నియమితులైన బీ వెంకటేశ్వర్లు, కర్నె ప్రభాకర్, భానుప్రసాద్‌రావు, అసెంబ్లీలో విప్ బాల్క సుమన్‌లకు సమావేశం తరఫున కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు పీ రాములు, బండ ప్రకాశ్, లింగయ్యయాదవ్, చీఫ్‌విప్ బీ వెంకటేశ్వర్లు, విప్‌లు కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఫరీదుద్దీన్, భానుప్రసాద్‌రావు, ఫారూఖ్ హుస్సేన్, గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రవణ్‌రెడ్డి జన్మదినం

పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కేక్ కట్‌చేశారు. శ్రవణ్‌రెడ్డికి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ బీ వెంకటేశ్వర్లు, విప్ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, పలువురు పార్టీ నేతలు శ్రవణ్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ktr-municipal

కేటీఆర్‌కు ఘనస్వాగతం

రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి బుధవారం తెలంగాణభవన్‌కు వచ్చిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేశారు. కేటీఆర్‌ను అభినందించినవారిలో మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, టీ రాజయ్య, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సతీశ్‌కుమార్, పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్‌రావు, కట్టెల శ్రీనివాస్‌యాదవ్, గుడిమళ్ల రవికుమార్, రాజయ్యయాదవ్, సినీ దర్శకుడు శంకర్ ఉన్నారు.

905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles