రైతు ఆదాయం రెట్టింపుపై సర్కార్ నజర్


Wed,May 15, 2019 02:30 AM

Ts Government Plan on the Farmer income double

-విత్తనరంగానికి మరింత ప్రోత్సాహం
-స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు
-కీలక సిఫారసులతో నివేదిక రూపొందించిన వ్యవసాయశాఖ

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే రైతుబంధు పథకంతో ఎకరాకు రూ.నాలుగు వేలు ఇస్తుండగా.. పెట్టుబడి వ్యయాన్ని మరిం త తగ్గించాలని యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసింది. ప్రధాన పంటలైన వరి, మక్కజొన్న, పప్పు ధాన్యాలు, పల్లీల దిగుబడిలో వ్యత్యాసాలను తగ్గించి ఉత్పత్తి పెంచాలని నిర్ణయించింది. తెలంగాణ విత్తనోత్పత్తికి ఎంతో అనుకూలమైన ప్రదేశం. ఏటా దాదాపు 37.42 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా అవసరమైన వరి విత్తనాలు 90 నుంచి 95 శాతం మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. 2022 నాటికి దేశ రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిని సాధ్యం చేసేలా తెలంగాణ సర్కార్ ఇప్పటికే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాలు ఇప్పటికే రైతుల ఆదాయం రెట్టింపు పై సొంత వ్యూహాలను రచించుకున్నాయి. మన రాష్ట్రంలో వ్యవసాయశాఖ నోడల్‌శాఖ గా, కమిషనర్ చైర్మన్‌గా, ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ సంచాలకులు సభ్యులుగా, వ్యవసాయ వర్సిటీ పరిశోధనా డైరెక్టర్ సభ్య కన్వీనర్‌గా ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇటీవలే సమావేశమై పలు కీలక సిఫారసులు చేసింది.

కమిటీ కీలక సిఫారసులు..

రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ముం దుగా సాగు వ్యయాన్ని తగ్గించాలని కమిటీ నివేదికలో ప్రధానంగా పేర్కొన్నది. ఉత్తమ ఆగ్రోనామికల్ ప్రాక్టీసెస్‌ను అనుసరించాలని, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియెంట్ మేనేజ్‌మెంట్ (ఐఎన్‌ఎం), ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐసీఎం) సాధించేలా చేయాలని సిఫారసు చేశా రు. భూముల్లో పోషకాలు పెంచేందుకు యాక్షన్ ప్లాన్ తయారుచేస్తున్నారు. వ్యవసాయ కూ లీలకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిరావడం తో సాగువ్యయం పెరుగుతున్నది. ఈ క్రమం లో చిన్న కమతాలకు సరిపోయే యంత్రాలను ప్రోత్సహించాలి. నాటు, కలుపుతీసే యంత్రాలను రైతులకు అందుబాటులోకి తేవాలి. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, చేపలు, కోళ్ల పెంపకం చేపట్టడం ద్వారా రైతు కుటుంబాల ఆదాయాన్ని పెంచవచ్చు. పంటకోత సమయంలో నష్టం వాటిల్లకుండా సూచనలు, సలహాలు ఇవ్వడం, శాస్త్రీయ పద్ధతిలో పంట నిల్వకు సదుపాయాలు కల్పించడం, ఈ- మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నా రు. పంట ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీవో), రైతు శిక్షణ కేంద్రాలను బలోపేతం చేయడం, సూక్ష్మనీటి సేద్యాన్ని సమర్థవంతం గా అమలుచేయడం, సీజన్ కంటే ముందే పంట రుణాలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అందించడం వంటి పలు సిఫారసులు చేశారు.

ఫుడ్‌ప్రాసెసింగ్, పంట కాలనీలు

ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలక్పొడం ద్వారా పంట ఉత్పత్తులకు మరింత గిట్టుబా టు ధరను కల్పించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై వ్యవసాయశాఖతోపాటు వ్యవసాయ వర్సిటీ నివేదికలు రూపొందించాయి. అలాగే పంట కాలనీలు ఏర్పాటుచేయడం ద్వారా డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగుచేయించాలని సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉన్నది. పంట కాలనీల్లో వరి, పత్తి, మక్కజొన్న వంటి లైట్‌సాయిల్ పంటలకు మినహాయింపు ఇవ్వాలని వ్యవసాయశాఖ ఇప్పటికే నిర్ణయించింది.

4052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles