గీతకార్మికులకు ప్రభుత్వ సాయంపై హర్షం

Sat,November 9, 2019 01:26 AM

-ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నాయకుల కృతజ్ఞతలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ గీతకార్మికులకు ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10.09 కోట్లు మంజూరు చేయడం పట్ల గౌడ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం హైదరాబాద్‌లో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన, లేదా శాశ్వత అంగవైకల్యం గల గీతకార్మికులకు రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.10 వేలు ఆర్థిక సాయం చేయడంపై గౌడసంఘం నేతలు హర్షం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వాలు ప్రమాదంలో మరణించినవారికి రూ.2లక్షలు, శాశ్వ త అంగవైకల్యం కలిగిన వారికి రూ.50 వేలు మాత్రమే ఇచ్చాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గౌడ అఫిషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కర్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, పవన్‌కుమార్ పాల్గొన్నారు.
neera

గీతకార్మికులకు ప్రభుత్వసాయం అభినందనీయం: ఆర్ కృష్ణయ్య

గీతవృత్తిదారులకు రూ.10.09 కోట్లు మంజూ రు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేయడం అభినందనీయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కులవృత్తుల పురోభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్నకృషి హర్షణీయమని జాతీ య బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి దాసు సురేశ్, ఇతర ప్రతినిధులు పేర్కొన్నారు.

87
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles