జాతీయ వెదురు మిషన్

Thu,October 10, 2019 02:17 AM

-కమిటీలో మార్పు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జాతీయ వెదురుమిషన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలుచేసేందుకు నెలకొల్పిన రాష్ట్రస్థాయి కమిటీ లో ప్రభుత్వం మార్పులుచేసింది. ఈ మేరకు బుధవారం వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి ఉత్తర్వులు జారీచేశారు. వీటి ప్రకారం.. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, ఉద్యానశాఖ కమిషనర్ సెక్రటరీగా, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల, గిరిజన సంక్షేమశాఖల కమిషనర్లు, అటవీశాఖశాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, ఫైనాన్స్ డి ప్యూటీ సెక్రటరీ, కేంద్ర వ్యవసాయశాఖ నామినీ, మరో ఇద్దరు వస్తు ఉత్పత్తి నిపుణులు, వెదురు సొసైటీ తెలంగాణ, ఏపీ చాప్టర్ల చైర్మన్లు ఆర్కే మిత్రా, కే విజయకుమార్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.

163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles