మున్సిపల్ ఎన్నికలపై నేడు విచారణ


Wed,August 14, 2019 01:16 AM

ts High Court To Hear Municipal Elections Petition Today

-అరవైకిపైగా దాఖలైన కేసులు
-నిబంధనలు పాటించాం: ప్రభుత్వం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని 132 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారించనున్నది. మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు జూలై రెండుతో ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. ఈ క్రమంలో పురపాలక ఎన్నికల్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికల్ని ఖరారు చేసింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సంసిద్ధంగా ఉన్నది. అయితే, అరవైకి పైగా మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభు త్వం కౌంటర్ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం జరిపే ముందస్తు కార్యాచరణలో ఎలాంటి ఉల్లంఘనలు జరుగలేదని, అన్నీ నిబంధనల ప్రకారమే చేసినట్టు రాష్ట్ర ప్రభు త్వం హైకోర్టుకు నివేదించింది. ఇందుకు సంబంధించిన తుది వాదనను రాష్ట్ర ప్రభు త్వం బుధవారం వినిపించనున్నది.

-అంతా నిబంధనల ప్రకారమే..
మున్సిపాలిటీల పాలకవర్గం గడువు గత నెలలోనే ముగిసిపోవడంతో వీలైనంత త్వరగా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో ఇదివరకే ప్రభుత్వం పేర్కొన్నది. ప్రీఎలక్షన్ ప్రక్రియలో భాగంగా వార్డుల విభజన, ఓటర్ల జాబితా ముద్రణ, వార్డులవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ పూర్తయిందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 23న విడుదలచేసిన ఆర్డినెన్స్ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం పదవులను రిజర్వ్ చేస్తున్నదని పేర్కొన్నది. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన వ్యాజ్యాలను కొట్టేయాలని కోరింది. ఈ అంశంపై మంగళవారం జరుగాల్సిన విచారణ బుధవారానికి వాయిదా పడిం ది. హైకోర్టు నుంచి పచ్చజెండా లభించిన రెం డురోజుల్లోనే రిజర్వేషన్లు ఖరారుచేసి నివేదికను ఎస్‌ఈసీకి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది.

265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles