రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్


Wed,August 14, 2019 12:54 AM

Universal Health Screening in the State

-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం
-విధి విధానాలు రూపొందించాలని జిల్లా అధికారులకు ఆదేశం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ (వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు) నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలవారీగా డీఎంహెచ్‌వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లతో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ యోగితారాణా మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు జరిపారు. టీబీ, లెప్రసీ పరీక్షలు జరుపుతున్నందున బీపీ, ఇతర ఆరోగ్య పరీక్షలు యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ పేరిట నిర్వహించాల్సి ఉన్నదని చెప్పారు. ఇందుకు విధివిధానాలను రూపొందించి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లుచేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

99
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles