సంబురంగా గృహ ప్రవేశాలు

Fri,November 8, 2019 02:05 AM

తునికిబొల్లారంలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ప్రారంభోత్సవం
గజ్వేల్, నమస్తేతెలంగాణ: కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపు గ్రామాల భూనిర్వాసితులకు తునికిబొల్లారంలో నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో గృహప్రవేశాలు గురువారం సంబురంగా జరిగాయి. ములుగు మండలం తానేదార్‌పల్లి తండాకు చెందిన 84 కుటుంబాల వారు సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి నిర్వాసితులచే ప్రవేశాలు చేయించి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం ధాన్యాగారంగా మారుతుందన్నారు. 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా ఏ రాష్ట్రంలోనూ నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ పరిసర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 7,800 నిర్వాసితుల కుటుంబాలు ఉన్నాయని, వీరందరికి ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీని అందించడమే కాకుండా అత్యాధునిక సౌకర్యాలతో పునరావాస కాలనీలను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు.

318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles