కాళేశ్వరం పరీక్ష నేడే


Wed,April 24, 2019 03:09 AM

Water Released from Kaleshwaram Project

-నందిమేడారం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు సర్వం సిద్ధం
-ఉదయం 11 గంటలకు భారీ మోటర్ వెట్న్
-రేపు మరో రెండు మోటర్లతో ఎత్తిపోత!

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ధర్మారం:కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానున్నది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తిచేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటుచేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్న్‌క్రు అంతా సిద్ధమయింది. బుధవారం ఉదయం 11 గం టలకు స్విచ్ఛాన్ చేసి భారీ మోటర్‌ను ప్రారంభించనున్నారు. సాంకేతిక ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తవడంతో బుధవారం ఉద యం మొదటి మోటరు వెట్న్‌క్రు ముహూ ర్తం ఖరారుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వచేసేందుకు మొత్తం 82 మోటర్లను ఏర్పాటుచేస్తున్నారు.

కనిష్ఠంగా 2.66 మెగావాట్లు మొ దలు 26, 40, 106.. ఇలా ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న.. బాహుబలిగా పిలిచే 139 మెగావాట్ల మోటరును కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. వీటి ఏర్పా ట్లు వివిధదశల్లో ఉన్నాయి. నంది మేడారం పంపుహౌజ్‌లో 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను అమరుస్తున్నారు. ఏడింటికిగాను నాలుగు డ్రైరన్ పూర్తి చేసుకొని, వెట్న్‌క్రు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో బుధవారం ఉదయం మొదటి మోటరు వెట్న్ చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్, ఇంజినీర్ల బృందం ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.

20-30 నిమిషాల్లో అన్ని కోణాల్లో పరిశీలన

ఎల్లంపల్లి జలాశయం నుంచి విడుదలచేసిన నీటితో నందిమేడారం పంపుహౌజ్‌లోని సర్జ్‌పూల్‌లో మంగళవారం రాత్రి సమయానికి 142.30 మీటర్ల మేర నింపారు. సోమవారం రాత్రి మొదటి మోటరుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ట్యూబ్ గేట్‌ను ఎత్తిన అధికారులు.. మంగళవారం రాత్రి రెండో మోటరు డ్రాఫ్ట్‌ట్యూబ్ గేటును కూడా ఎత్తారు. బుధవారం ఉదయం వెట్న్‌ల్రో భాగంగా మొదటి మోటరును ఆన్‌చేయగానే పంపులు డిజైన్‌స్థాయి వేగానికి (ఆర్పీఎం- రెవల్యూషన్స్ పర్ మినిట్) తిరుగుతున్నయా? అనే అంశాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత మోటరులోని ఇంపుల్లర్‌లోకి నీటిని పంపేందుకుగాను బట్టర్‌ైఫ్లె వాల్వ్ తెరుచుకుంటుంది. దీంతో ఇంపుల్లర్ వేగంగా తిరుగడంతో అందులోకి చేరిన నీటిని ఎత్తిపోస్తుంది.

ఆ నీరు 340 మీటర్ల దూరం పైపుల ద్వారా వెళ్లి, డెలివరీ మెయిన్ నుంచి టన్నెల్ బయట ఉన్న డెలివరీ సిస్టర్న్‌లోకి పంపింగ్ అవుతుంది. సిస్టర్న్ ద్వారా బయటకు వచ్చిన నీరు 550 మీటర్ల పొడవుతో నిర్మించిన లీడ్ చానల్ గుండా నందిమేడారం రిజర్వాయర్‌లోకి పంపింగ్ అవుతుంది. ఆ సమయంలోనే నిర్ణీత వేగం, డిజైన్‌కు అనుగుణంగా నీటి విడుదల అవుతున్నదా? ఇలా అనేక సాంకేతిక కోణాల్లో సమగ్రంగా పరిశీలించనున్నారు. ఈ వెట్న్ దాదాపు 20-30 నిమిషాలపాటు చేపట్టనున్నారు. గురువారం మరో రెండుమోటర్లకు వెట్న్ నిర్వహించే అవకాశాలున్నాయి.

3901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles