ఎంజీఎం ఆధునీకరణకు కృషి


Mon,August 26, 2019 01:25 AM

We will work to modernize MGM

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
హసన్‌పర్తి: ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధాన దవాఖాన వరంగల్ ఎంజీఎంను మరింత ఆధునీకరించేందుకు కృషి చేస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లిలో ఆదివారం జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర 3వ జోన్ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. అమెరికా తదితర దేశాల్లో వరంగల్ వై ద్యులకు మంచి గుర్తింపు ఉన్నదన్నారు. వైద్యరంగంలో గొప్ప డాక్టర్లకు వరంగల్, హైదరాబాద్ నగరాలు కేంద్రంగా మారినట్టు తెలిపా రు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలం దించేందుకు వరంగల్‌లోని ఎంజీఎంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపునకు సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారనీ, ఇకపై ప్రతీ నెలా ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మూడో జోన్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పిల్లి సాంబశివరావు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles