ప్రేమించానన్నాడు.. లోబర్చుకున్నాడు..పెండ్లి అనగానే చంపేశాడు


Mon,April 15, 2019 01:18 AM

Woman body found in suitcase in Hyderabad

-మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి మురికి కాల్వలో వేసిన నిందితుడు
-సూరారం సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్యను చేధించిన పోలీసులు

దుండిగల్/రామచంద్రాపురం: హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం కాలనీలో యువతి దారుణహత్య కలకలం సృష్టించింది. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ఉన్న పరిచయాన్ని ప్రేమగా మార్చి లోబర్చుకున్న యువకుడు పెండ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో అడ్డుతొలిగించుకొన్నాడు. ఆర్సీపురం పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన మనోజ్‌షా కుటుంబం కొన్నేండ్ల క్రితం నగరానికి వలసవచ్చి సూరారం కాలనీలో స్థిరప డింది. ఆయన కుమారుడు సునీల్ మేడ్చల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న సమయంలో అదే కాలేజీకి చెందిన ఆర్సీపు రం నివాసి శ్రీనివాస్‌రావు కుమార్తె లావణ్య (25)తో పరిచయం పెంచుకున్నాడు. బీటెక్ పూర్తైన తర్వాత ఇద్దరూ వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరారు. అయితే తరుచూ కలుసుకొంటుండగా.. వారి స్నేహం ప్రేమగా మారిం ది. అయితే లావణ్యను పెండ్లి చేసుకొంటానని నమ్మించిన సునీల్.. అమెను లోబర్చుకున్నాడు. పెండ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. ఈ క్ర మంలో ఉద్యోగ నిమిత్తం సూడాన్ వెళ్తున్నానని, లావణ్యను కూడా తీసుకెళ్తున్నట్టు ఆమె కుటుంబీకులను ఒప్పించాడు. ఈనెల 4న ఇ ద్దరూ సూడాన్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరికి యువతి తల్లిదండ్రులు విమానాశ్ర యం వరకు వచ్చి వీడ్కోలు పలికారు.

పథకం ప్రకారమే..
సూడాన్ వెళ్తున్నట్టు నకిలీ విమాన టికె ట్లు సంపాదించిన సునీల్.. విమానాశ్రయంలోకి అలా వెళ్లి ఇలా బయటకు వచ్చాడు. సూడాన్ వెళ్లే విమానం రద్దయిందంటూ లావణ్యను నమ్మించి ఆ రాత్రి శంషాబాద్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. మరుసటిరోజు పెండ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగడంతో లావణ్యను చంపి.. శవాన్ని సూట్‌కేస్‌లో కుక్కాడు. 6వ తేదీన రాత్రి సూరారం సుందర్‌నగర్‌లోని ఇంటికి వస్తూ స్థానికంగా ఉన్న మోరీలో లావణ్య శవం ఉన్న సూట్‌కేసును పడేశాడు. సూడాన్ నుంచి చాటింగ్ చేస్తున్నట్టు లావణ్య తల్లిదండ్రులకు వాట్సప్ మెసేజ్‌లు పెట్టేవా డు. ఇండియాకు తిరిగి వస్తున్నట్టు 7న లావణ్య మొబైల్ నుంచి సమాచారమిచ్చాడు. తమ కూతురు ఇంటికి తిరిగిరాక పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అదేరోజు రాత్రి ఆర్సీపురం పోలీసులను ఆశ్రయించారు. సునీల్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకొని విచారించగా లావణ్యను తానే హత్యచేసినట్టు ఒప్పుకొన్నాడు. నాలాలో నుంచి లావణ్య మృతదేహాన్ని వెలికితీసి గాంధీ దవాఖానకు తరలించారు.

9818
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles