టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

Fri,April 19, 2019 03:26 PM

AP High Court issued notices to TDP leaders

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణాశాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం కేసులో టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 2017లో రవాణాశాఖ కమిషనర్‌పై దౌర్జన్యంకు పాల్పడిన ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కేసు తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేసింది.

3085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles