తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

Sun,May 26, 2019 05:56 PM

cm kcr reaches tirumala

తిరుపతి: సీఎం కేసీఆర్ తిరుమల చేరుకున్నారు. తిరుమల శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద కేసీఆర్‌కు టీటీడీ ఈవో సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఘనస్వాగతం పలికారు. ఇవాళ రాత్రి శ్రీకృష్ణ అతిథిగృహంలో కేసీఆర్ బస చేయనున్నారు. రేపు ఉదయం 5.30కి కేసీఆర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.

శ్రీవారి దర్శనార్థం ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలలోని పద్మావతినగర్‌లో ఉన్న శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. దర్శనానంతరం ఆలయం నుంచి తిరిగి అతిథి గృహానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

3322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles