కాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం

Thu,May 30, 2019 11:18 AM

jagan mohan reddy chief minister Swearing Ceremony

విజయవాడ : మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే వేలాది మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వీలైనంత త్వరగా వెళ్లాలని అభిమానులు భావించడంతో ఉదయం నుంచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కిటకిటలాడుతోంది. స్టేడియం మొత్తం జగన్‌ నినాదాలతో మారుమోగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమకు కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకుంటున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావులతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

మరోవైపు తమ అభిమాన నాయకుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడటానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయవాడ రాలేని వారు టీవీల్లో ఈ వేడుకను చూసేందుకు సిద్దమవుతున్నారు. ఉదయం నుంచే సామాన్య ప్రజలు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు భారీగా చేరుకోవడంతో 8 గంటల వరకే గ్యాలరీలు నిండిపోయాయి. గ్యాలరీల్లో ఉన్నవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం బయట కూడా ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.

వేదిక వద్దకు బయలుదేరిన వైఎస్‌ కుటుంబ సభ్యులు


వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వైఎస్‌ కుటుంబ సభ్యులు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి బయలుదేరారు.

విజయవాడ చేరుకున్న పుదుచ్చేరి మంత్రి మల్లాడి


వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడానికి పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున అధికారులు స్వాగతం పలికారు. ప్రముఖ చిత్రకారుడు బీఎస్వీ ప్రసాద్‌చే ప్రత్యేకంగా తయారు చేయించిన దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆయన వైఎస్‌ జగన్‌కు అందజేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం మొదటగా కేసీఆర్‌, మల్లాడి, స్టాలిన్‌లు వైఎస్‌ జగన్‌ను సత్కరించనున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న స్టాలిన్‌..


వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం కోసం డీఎంకే అధినేత స్టాలిన్‌ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వాగం పలికారు.

2618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles