కోడెల అంతిమయాత్రలో మీ నటన చూశాను..

Fri,September 20, 2019 06:07 PM

తూర్పు గోదావరి : టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోడెల శివప్రసాద్ అంతిమ యాత్రలో చంద్రబాబు నటన చూశాను. ప్రజల్లో సానుభూతి కోసం నటించడం ఎందుకు? అని ముద్రగడ ప్రశ్నించారు. అంతిమయాత్రకు వచ్చిన వారికి నమస్కారం చేయాలి. లేదా మౌనంగా ఉండాలి. కానీ రెండు వేళ్లు చూపడం మీ సంస్కారమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నటన అంతా రాజకీయ లబ్ధికోసం కదా? అని బాబును ముద్రగడ ప్రశ్నించారు. కిర్లంపూడిని పాకిస్థాన్‌గా, తనను ఉగ్రవాదిగా, తమ జాతిని ఉగ్రవాదుల కింద ముద్ర వేసింది మీరు కాదా? ఈ రోజు కేసుల చిట్టా చెప్తున్నారు. మరి మీ పాలనలో తమ జాతి మీద పెట్టిన కేసులు మర్చిపోయారా? రాక్షస పాలనతో రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించి, మనుషులను హీనంగా చూసి అవమానించింది మీరు కాదా? ఇంతటి ఘన చరిత్ర పెట్టుకుని రాష్ట్రం కోసమే బతుకుతున్నానని దొంగ మాటలు చెబుతూ ఇంకా ఎంతకాలం కన్నీరు కారుస్తూ నటిస్తారో మీరే చెప్పాలని చంద్రబాబును ముద్రగడ పద్మనాభం నిలదీశారు.

3946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles