ఫైనాన్స్ వ్యాపారిపై పెట్రోల్‌తో దాడి

Fri,November 23, 2018 03:17 PM

అమరావతి: ఏపీలోని విజయవాడలో పట్టపగలు దారుణ సంఘటన చోటుచేసుకుంది. గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. గగారిన్ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. తోటి ఫైనాన్సర్లతో వివాదమే ఈ ఘాతుకానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వ్యాపార భాగస్వాఇ దూమాలపాటి శ్రీకృష్ణపై అనుమానం వ్యక్తం చేశారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 80శాతం గాయాలతో కొనఊపరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మాదాల సురేష్, మాదాల సుధాకర్‌లు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనట్లుగా బాధితుడు తెలిపాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles