టీడీపీని వీడిన నలుగురు ఎంపీలు

Thu,June 20, 2019 04:51 PM

rajya sabha MP's Four quit TDP

ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీలు నలుగురు ఆ పార్టీని వీడారు. టీడీపీని వీడుతున్నట్లు పేర్కొంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు నలుగురు ఎంపీలు లేఖ ఇచ్చారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు నలుగురు ఎంపీలు టీడీపీని వీడుతున్న రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన లేఖలో సంతకాలు చేశారు. సభలో తమను ఒక గ్రూప్‌గా పరిగణించాలని పేర్కొన్నారు. త్వరలోనే వీరంతా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇక టీడీపీకి రాజ్యసభలో మిగిలింది ఇద్దరు ఎంపీలే. సుజనా చౌదరి, సీఎం రమేష్ పార్టీకి చెందిన సీనియర్ నేతలే కాక ఆ పార్టీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు. మనీ లాండరింగ్, బ్యాంకులను మోసగించిన కేసుల్లో ఈడీ ఇప్పటికే సుజనా చౌదరికి చెందిన 315 కోట్లను జప్తు చేసిన విషయం తెలిసిందే. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అసెంబ్లీ 175 స్థానాల్లో 23 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు నేడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. సమావేశం ఉద్ధేశ్యం, వివరాలు తెలియాల్సి ఉంది.

5481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles