నన్ను వదిలెయ్యండి.. ఇంకెప్పుడూ సర్వేలు చెయ్యను..!

Thu,May 23, 2019 02:29 PM

social media trolling on lagadapati rajagopal

కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి బొక్కబోర్లా పడ్డాడు. మామూలుగా కాదు. ఇప్పటికే ఓసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బోగస్ సర్వే చేసి అడ్డంగా బుక్కయిన లగడపాటి.. ఏపీ ఎన్నికల్లోనూ మళ్లీ అలాంటి బోగస్ సర్వే చేసి తుస్సుమన్నాడు.

ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ పేరుతో ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించిన లగడపాటి.. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నదని జోస్యం చెప్పాడు. ఇతర జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఏపీలో వైఎస్సార్సీపీ గెలుస్తుందని చెబితే.. ఈయన ఒక్కడు మాత్రం ఏపీలో టీడీపీదే మళ్లీ అధికారం అంటూ పనికిమాలిన సర్వేను ప్రకటించాడు.

కానీ.. ఇవాళ్టి ఫలితాలను చూస్తే లగడపాటి సర్వే.. ఓ చెత్త సర్వే అని తేలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా వైఎస్సార్సీపీ బద్దలు కొట్టి.. ప్రస్తుతం 150 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది.

ఇక.. నెటిజన్లు ఊరుకుంటారా? లగడపాటిపై విమర్శల వర్షం కురిపించారు. సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్‌తో, ఫన్నీ ఫోటోలతో లగడపాటిని ఓ ఆట ఆడుకున్నారు. చివరకు.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా.. లగడపాటిపై ఫన్నీగా ఓ ట్వీట్ చేశారు. నన్ను వదలెయ్యండి.. ఇంకెప్పుడూ ఇక సర్వేలు చెయ్యను.. అంటూ లగడపాటి అంటున్నట్టు.. ఆయన్ను కొందరు వ్యక్తులు ఎత్తుకొని తీసుకెళ్తున్నట్టు ఉంది ఆ ఫోటో. నెటిజన్లు కూడా లగడపాటిని ఎలా ఆడుకున్నారో మీరే చూడండి.


14879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles