శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

Fri,June 7, 2019 10:28 AM

TTD release Arjitha Seva Tickets Online Booking

హైదరాబాద్‌ : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2019 సెప్టెంబర్‌ నెలకు సంబంధించి 70,918 టికెట్లను విడుదల చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,618 సేవా టికెట్లు, సుప్రభాతం 7,898, తోమాల 120, అర్చన 120, అష్టాదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300, కరెంట్‌ బుకింగ్‌ కింద 60,300 ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసింది. విశేష పూజ 2,000, కల్యాణోత్సవం 13,775 సేవా టికెట్లు, ఊంజల్‌ సేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకరణ కింద 16,800 టికెట్లు విడుదల చేసింది టీటీడీ.

1163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles