బాబుపై ఉన్నట్లు..నాపై ఓటుకు కోట్లు కేసులు లేవు!

Fri,November 15, 2019 08:00 PM

అమరావతి: పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టీడీపీ శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఐతే సస్పెన్షన్ కంటే ముందే వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై వంశీ స్పందించారు. వంశీ మాట్లాడుతూ..'నన్ను టీడీపీ సస్పెండ్ చేయడమేంటి?. నేను ముందే టీడీపీకి రాజీనామా చేశా. టీడీపీ ఇచ్చే షోకాజ్ నోటీసులకు స్పందించాల్సిన అవసరం లేదు. గన్నవరంలో పప్పు పోటీ చేసినా ఫర్వాలేదు. నాకు హైదరాబాద్‌లో ఆస్తులు ఎక్కడున్నాయో పప్పు ఆధారాలు చూపించాలి. చంద్రబాబుపై ఉన్నట్లు.. నాపై ఓటుకు కోట్లు కేసులు లేవు. టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. లోకేష్‌లా నేను పదవులకు ఆశపడలేదు. నాపై టీడీపీ నేతలు ఎన్ని కేసులు పెట్టినా భయపడను. లోకేష్ టీడీపీకి పెద్ద గుదిబండ. జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి పప్పు భయపడుతున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ కనుమరుగవుతుంద'న్నారు.

1759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles