అమరావతి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఇవాళ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ట్విటర్లో స్పందించారు. 'ప్రధాని నరేంద్ర మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన బాధ్యత లేని వ్యక్తి అని అనేక రకాలుగా దూషించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత విభేదాలేమీ లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మోదీని గద్దె దింపడం కోసమే కాంగ్రెస్ తో చేతులు కలిపినట్టు చెప్పిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు. హుందాగా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ప్రచారానికి వెళ్లలేదట చంద్రబాబు. ఆయన కూడా హుందాగానే మాలోకం నిలబడిన మంగళగిరి మొహం చూడలేదేమో. ఆ విధంగా తామిద్దరం పార్టనర్లమని బయట పెట్టుకున్నారు. చీకటి పొత్తుల విషయాన్ని ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారని' విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.