హై సెక్యూరిటీ జోన్‌లో విజయవాడ

Thu,May 30, 2019 10:18 AM

Vijayawada is in high security zone

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 12.23 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ఏపీ సీఎంగా జగన్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో స్టేడియం ప్రాంగణానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా విజయవాడను పోలీసులు హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించారు. 5 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు 13 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. జగన్‌ ప్రమాణ స్వీకారం కారణంగా విజయవాడలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆంక్షలు ఈ సాయంత్రం వరకు కొనసాగనున్నాయి.

2055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles