శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలిచ్చే భక్తులకు విఐపి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు

Mon,October 21, 2019 08:51 PM

తిరుమల : ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఇత‌ర వెనుక‌బ‌డిన‌ ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి, పురాత‌న ఆల‌యాల ప‌రిర‌క్ష‌ణ‌కు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా విరాళాలు స్వీక‌రిస్తున్నామ‌ని టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా విరాళాలిచ్చే భక్తులకు ప్రివిలేజ్
లో భాగంగా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు.


తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతి గృహంలోని స‌మావేశ మందిరంలో సోమ‌వారం అద‌న‌పు ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ.. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలిచ్చే దాత‌ల‌కు బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు ఇచ్చే విధానాన్ని సోమ‌వారం నుంచి న‌లుగురు దాత‌ల‌తో ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. ఇందుకోసం గోకులం విశ్రాంతి గృహంలో ఆఫ్‌లైన్‌లో సింగిల్ విండో కౌంట‌ర్‌ను ప్రారంభించామ‌ని తెలిపారు. న‌వంబ‌రు మొద‌టి వారంలో ఇందుకోసం ప్ర‌త్యేకంగా యాప్‌ను ప్రారంభిస్తామ‌ని, ఆ త‌రువాత ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు ఆన్‌లైన్‌లో విరాళాలందించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ.10 వేలు విరాళ‌మిచ్చే దాత‌ల‌కు ఒక బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ ప్రివిలేజ్‌గా ఒక‌సారి మాత్ర‌మే అందిస్తామ‌ని, వెంట‌నే స‌ద‌రు దాత‌లు రూ.500 చెల్లించి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌లు ఒక రూపాయి నుంచి ఎంత‌మొత్త‌మైనా విరాళంగా అందించవ‌చ్చ‌ని, రూ.10 వేల నుంచి టిటిడి క‌ల్పించే ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు.

రూ.10 వేల‌కు ఒక బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ చొప్పున రూ. 99 వేల వ‌ర‌కు 9 టికెట్ల‌ను దాత‌లు పొందే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఒక ల‌క్ష పైన విరాళాందించే దాత‌ల‌కు టిటిడి ఇదివ‌ర‌కే ప‌లు ట్ర‌స్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న త‌ర‌హాలోనే ప్ర‌యోజ‌నాల‌ను వ‌ర్తింప‌చేస్తామ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించామ‌ని, భ‌క్తుల స్పంద‌న‌ను దృష్టిలో ఉంచుకుని కోటా నిర్ణ‌యిస్తామ‌ని, ఒక నెల ముందే ఈ కోటాను తెలియ‌జేస్తామ‌ని అద‌న‌పు ఈవో తెలియ‌జేశారు. శ్రీవాణి ట్రస్ట్ కు చెన్నైకి చెందిన శ్రీరామయ్య రూ.40,000 విరాళంతో పాటు ఒక్కొ దర్శన టికెట్ కు రూ.500 చెల్లించి 4 బ్రేక్ దర్శన టికెట్లను ముందుగా పొందారు.

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles