అనుమానంతో భార్యను చంపేసి.. మద్యంమత్తులో అత్తను కూడా..

Sat,July 20, 2019 10:57 AM

wife and mother in law killed by husband in West Godavari dist

హైదరాబాద్ : అనుమానం.. పెనుభూతంగా మారింది. కట్టుకున్న భార్యను ఓ భర్త కడతేర్చాడు. బిడ్డను కాపాడుకుందామని అడ్డుగా వచ్చిన అత్తను కూడా కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం రాంపాలెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రాంపాలెం గ్రామానికి చెందిన కాంతారావు, దొండపూడికి చెందిన లక్ష్మికి 15 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. అయితే పళ్లైన కొంత కాలం తర్వాత భార్యను వేధింపులకు గురి చేస్తూ.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు కాంతారావు. భర్త వేధింపులు భరించలేని లక్ష్మి తన పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. నాలుగు నెలల నుంచి తల్లి వద్దే ఉంటున్న లక్ష్మిపై కోపం పెంచుకున్న కాంతారావు.. శుక్రవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించి దొండపూడికి వెళ్లాడు. తనతో రావాలని భార్యను కాంతారావు కోరాడు.

ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన కాంతారావు.. తన వెంట తెచ్చుకున్న కత్తితో లక్ష్మిపై దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కూతురిని కాపాడుకుందామని అడ్డొచ్చినా అత్త పుష్పవతిపై కూడా అదే కత్తితో దాడి చేయడంతో ఆమె కూడా మృతి చెందింది. కాంతారావును అడ్డుకునేందుకు వచ్చిన లక్ష్మి సోదరుడిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. మొత్తానికి కాంతారావును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ జంట హత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

1538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles