ఆనంద భాష్పాలు రాల్చిన విజయమ్మ

Thu,May 30, 2019 01:47 PM

YS Jagan emotional mother Vijayamma hugged him

హైదరాబాద్‌ : తన కుమారుడు ఒక గొప్ప స్థానానికి ఎదిగితే ఏ తల్లికైనా సంతోషముంటుంది. ఆ సంతోషంతో తల్లి భావోద్వేగానికి లోనవుతుంది. తన బిడ్డను తీసుకుని హృదయానికి హత్తుకుంటుంది. తన ప్రేమను పంచుతుంది తల్లి. ఇవాళ వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రెండో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన తల్లి విజయమ్మ ఆనందభాష్పాలు రాల్చింది. జగన్‌ను దగ్గరకు తీసుకుని తన హృదయానికి హత్తుకుంది. తల్లి రాల్చిన ఆనంద భాష్పాలను కుమారుడు జగన్‌ తన చేత్తో తూడిచి.. ఓదార్చాడు. ఈ సన్నివేశంతో సభలో ఒక్కసారి అందరి గుండెలు కరిగిపోయాయి. తొమ్మిదేళ్ల పాటు శ్రమించి.. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ 151 స్థానాలను కైవసం చేసుకుని ఏపీ పాలనాపగ్గాలు చేపట్టారు వైఎస్‌ జగన్‌.5092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles