'మీడియా నయీం'ను ఏ 'బాబు' రక్షిస్తాడో? ర‌వి ప్ర‌కాశ్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్

Wed,May 15, 2019 03:00 PM

ysrcp mp vijaya sai reddy counter tweets on tv9 former ceo ravi prakash

అమరావతి: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో కౌంటర్ వేశారు. ఇప్పటికే ట్విట్టర్‌లో రవి ప్రకాశ్‌పై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్న విజయసాయిరెడ్డి.. మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు.

నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం పరారైపోయింది. విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాశ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే.. నకిలీ ప్రవక్త రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్ దాటేశాడు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో.. అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో.. పోలీసులు వస్తే ఇంట్లో కనిపిండు, నోటీసులకు స్పందించడు, పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ప్రవక్తను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ మీడియా నయీంను ఏ బాబు రక్షిస్తాడో చూడాలి.. అని అన్నారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. సొంత పార్టీ నేతలే ఎక్కడికక్కడ వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నికల సమీక్షల్లో తమ్ముళ్లు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియక బాబు బిక్క చచ్చిపోతున్నారట. పార్టీ శ్రేణుల్లో దైర్యం నూరిపోయడం సంగతి సరే. సమీక్షలను ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్‌కు ముందే కొంప కొల్లేరని గ్రహించే రద్దు చేశారట.. అంటూ ఒక ట్వీట్, తర్వాత.. 150 ప్లస్, 140, 130, 120, 110.. చంద్రబాబు, ఆయన చెంచాలు వివిధ సందర్భాల్లో గెలుస్తామని చెప్పిన అసెంబ్లీ సీట్లు, లోక్‌సభ సీట్లపై అసలు నోరే మెదపడం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా 80 శాతం పోలింగ్ జరిగినప్పుడే బాబు పార్టీ వెంటిలేటర్ పైకి వెళ్లింది. పైనవన్నీ కవరింగ్ ఫిగర్సే.. అంటూ ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి.
2504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles