చైతూ 1980,81,82 సాంగ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Tue,October 30, 2018 11:40 AM

నాగ చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన స‌వ్య‌సాచి చిత్ర ప్ర‌మోష‌న్స్ జోరుగా జ‌రుగుతున్నాయి. న‌వంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప‌లు సాంగ్స్ విడుద‌ల చేస్తూ మూవీపై ఆస‌క్తి క‌లిగించేలా చేస్తున్నారు. తాజాగా ‘1980, 81, 82...’ అంటూ సాగే సాంగ్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రాని ఓ సరికొత్త కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందించారు. చిత్రంలో వెన్నెల కిషోర్‌, సత్య, రావు రమేష్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. ఈ చిత్రంలో చైతూ త‌న రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ని, ప్ర‌త్య‌ర్ధుల‌ని ఎదుర్కొంటాడు అని చూపించ‌నున్నారు.


1860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles