చిక్కుల్లో 2.0 చిత్రం.. రిలీజ్‌పై సందిగ్ధం!

Wed,November 28, 2018 08:43 AM
2.0 movie in troubles

ద‌ర్శ‌క దిగ్గ‌జం శంక‌ర్ తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ 2.0 చిత్రం రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీజాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రాన్ని 500 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, మూవీ చుట్టూ వివాదం నెల‌కొండ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. చిత్ర టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌లో సెల్ ఫోన్ వాడంక‌పై ప్ర‌జ‌లలో భ‌యాందోళ‌న‌లు క‌లిగేలా స‌న్నివేశాలు ఉన్నాయ‌ని, మొబైల్ ఫోన్స్, సెల్ టవర్స్ వల్ల మానవాళికి ప్రమాదకరం అనే నే తప్పుడు మెసేజ్ ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. వీటివల్ల తప్పుడు సంకేతాలు వెళతాయంటూ టెలికాం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సెల్‌ఫోన్‌ వల్ల పర్యావరణానికి హాని జరిగినట్లు శాస్త్రీయంగా ఎక్కడా రుజువుకాలేదని టెలికాం సంస్థ పేర్కొంది. సెల్యూలార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) కేంద్ర సెన్సార్ బోర్డ్‌కి, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేయ‌డంతో ఈ మూవీ రిలీజ్‌పై సందిగ్థం నెల‌కొంది. మ‌రి చిత్ర యూనిట్ స‌మ‌స్య‌ల‌ని ఎలా సాల్వ్ చేసుకొని సినిమా విడుద‌ల చేస్తుందో చూడాలి.

2982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles