హాలీవుడ్ చిత్రం దెబ్బ‌కి వాయిదా ప‌డ‌నున్న 2.0

Thu,June 27, 2019 11:32 AM

గ‌త ఏడాది విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం 2.0. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ 2.0 ని చైనాలో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జూలై 12న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు హెచ్ వై మీడియా అనే డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ గ‌తంలో ప్ర‌క‌టించింది. తాజా స‌మాచారం 2.0 చిత్రాన్ని చైనాలో పోస్ట్ పోన్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. డిస్నీసంస్థ నుండి వ‌స్తున్న‌ ద ల‌య‌న్ కింగ్ అనే చిత్రం హై విజువల్స్ తో జులై 19న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో రెండు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డితే క‌లెక్ష‌న్స్‌లో కాస్త జాప్యం జ‌రుగుతుంద‌ని భావించిన టీం 2.0 చిత్రాన్ని వాయిదా వేయ‌నుంద‌ట‌. త్వ‌ర‌లో రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు.


ర‌జనీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన 2.0 చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ర‌జ‌నీకాంత్ కెరియ‌ర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా 2.0 నిలిచింది. ర‌జ‌నీకాంత్‌కి దేశ‌, విదేశాల‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేప‌థ్యంలో 2.0 చిత్రాన్ని చైనాలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించారు. హెచ్‌వై మీడియా సంస్థ ఇప్ప‌టికే చిత్ర డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ ద‌క్కించుకోగా చైనాలో ఈ చిత్రం 'బాలీవుడ్ రోబో 2.0: రిస‌ర్జెన్స్' అనే టైటిల్‌తో విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. గ‌తంలో చైనాలో విడుద‌లైన బాహుబ‌లి 2 చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించిన సంగ‌తి తెలిసిందే. 2.0 చిత్రాన్ని 10 వేల థియేట‌ర్స్ ( 56 వేల స్క్రీన్స్‌లో ) విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు లైకా గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే . ఇక 3డీలో 47 వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఓ విదేశీయ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ఇంత భారీ సంఖ్య‌లో విడుద‌ల కావ‌డం ఇదే తొలిసారి.

2473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles