చైనాలో విడుద‌ల కానున్న 2.0.. రిలీజ్ డేట్ ఫిక్స్

Mon,June 3, 2019 04:37 PM
2.0 releasing in china on july

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన చిత్రాల‌న్ని చైనాలో విడుద‌లై అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ 2.0 కూడా చైనాలో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. ర‌జనీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ర‌జ‌నీకాంత్ కెరియ‌ర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా 2.0 నిలిచింది. ర‌జ‌నీకాంత్‌కి దేశ‌, విదేశాల‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేప‌థ్యంలో 2.0 చిత్రాన్ని చైనాలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించారు. హెచ్‌వై మీడియా సంస్థ ఇప్ప‌టికే చిత్ర డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ ద‌క్కించుకోగా జూలై 12న చిత్ర‌ విడుద‌ల‌కి ప్లాన్ చేశారు. అయితే చైనాలో ఈ చిత్రం 'బాలీవుడ్ రోబో 2.0: రిస‌ర్జెన్స్' అనే టైటిల్‌తో విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. గ‌తంలో చైనాలో విడుద‌లైన బాహుబ‌లి 2 చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

2.0 చిత్రాన్ని 10 వేల థియేట‌ర్స్ ( 56 వేల స్క్రీన్స్‌లో ) విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు లైకా గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే . ఇక 3డీలో 47 వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఓ విదేశీయ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ఇంత భారీ సంఖ్య‌లో విడుద‌ల కావ‌డం ఇదే తొలిసారి. హెచ్ వై మీడియా అనే డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ 2.0 చిత్రాన్ని చైనాలో విడుద‌ల చేస్తుంది. 2.0 చిత్రం ఇండియాలోను భారీ సంఖ్య‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల‌లోను ఈ చిత్రం భారీ సంఖ్య‌లో వ‌సూళ్లు రాబ‌ట్టింది.

1226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles