రాజ‌శేఖ‌ర్ కూతురి సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తైంది

Sun,June 3, 2018 08:45 AM

యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివానీ .. 2 స్టేట్స్ తెలుగు రీమేక్‌తో వెండితెర ఎంట్రీ ఇస్తుంద‌నే సంగ‌తి తెలిసిందే. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన ‘2 స్టేట్స్’ హిందీ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుంది. దర్శకుడు వీవీ వినాయక్ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్ కుంచ‌ తెలుగు వ‌ర్షెన్‌ని తెర‌కెక్కిస్తున్నాడు. అడవి శేషు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కాళికాదేవి కొలువైన నగరం కోల్‌కతాలో ప‌దిహేను రోజుల పాటు మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. తాజాగా కోల్‌క‌తా షెడ్యూల్ పూర్తి కావ‌డంతో టీం అంద‌రు హైద‌రాబాద్ చేరుకున్నారు.

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 7 నుండి హైద‌రాబాద్‌లో మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తోన్న ఈ సినిమా లో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ హీరోయిన్ మదర్ పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ నటుడు రజత్ కపూర్ శివానీ తండ్రి పాత్రలో న‌టిస్తున్నాడు. క్యూట్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో శేష్‌, శివాని జంట కనువిందు చేస్తుందిని నిర్మాత‌ అన్నారు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, విద్యుల్లేఖా రామన్‌, హేమ, ఉత్తేజ్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా షానియల్‌ డియో ప‌ని చేస్తున్నారు.

4536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles