క‌న్నీళ్ళు పెట్టుకున్న విద్యాబాల‌న్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Fri,May 31, 2019 08:50 AM
A Teary eyed Vidya Balan Takes on Body Shaming

బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న విద్యా బాల‌న్ క‌న్నీళ్ళు పెట్టుకుంది. శ‌రీరాకృతిని, రూపుని చూసి ద‌య‌చేసి వెక్కిరించొద్దంటూ వేడుకుంది. త‌ను క‌న్నీళ్ళు పెట్టుకుంటూ పాట‌పాడుతున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. వివ‌రాల‌లోకి వెళితే శ‌రీరాకృతి వ‌ల‌న ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొంటున్న ఆత్మ‌స్థైర్యం నింపేందుకు ప్ర‌ముఖ రేడియో స్టేషన్ బిగ్ ఎఫ్ఎం ‘ధున్‌ బదల్‌ కే దేఖో’ పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని రూపొందించింది. ఇందులో యువతీ యువకులు బాడీ షేమింగ్ వ‌ల‌న తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో విద్యాబాల‌న్ కూడా వీడియో ద్వారా జీవితంలో బాడీ షేమింగ్‌ సంఘటనలు వివ‌రించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

5086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles