అంధుని పాత్రలో మరో నటుడు

Fri,May 25, 2018 06:43 PM

ఆదిపినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘నువ్వెవరు’. హరి దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమిళ సినిమా ‘అధే కంగల్’ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఆదిపినిశెట్టి ఈ చిత్రంలో అంధ చెఫ్ పాత్రలో కనిపించనున్నాడట. సినిమాలో ఆది హీరోయిన్ తాప్సీ ప్రేమలో పడతాడట. నువ్వవరు మూవీలో వెన్నెలకిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రవితేజ అంధుని పాత్రలో నటించిన రాజా దిగ్రేట్ బాక్సాపీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

3745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles