సైరా ట్రైల‌ర్‌పై అమీర్ కామెంట్‌

Fri,September 20, 2019 08:41 AM

మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో తెర‌కెక్కిన అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రం సైరా. రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. బుధ‌వారం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఈ ట్రైల‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రేక్ష‌కులే కాక సినీ సెలబ్రిటీలు కూడా ట్రైల‌ర్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. తాజాగా మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు. సైరా చిత్రం భారీ స్కేల్ మూవీ. చిరంజీవి గారికి నేను పెద్ద అభిమానిని. సినిమా చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. చిరంజీవి స‌ర్‌, రామ్ చ‌ర‌ణ్‌,చిత్ర బృందానికి నా శుభాకాంక్ష‌లు అని త‌న పోస్ట్‌లో తెలిపారు అమీర్

2339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles