రాజ‌స్థాన్‌లో వెంకీ కూతురి వివాహం..!

Fri,March 22, 2019 11:16 AM
Aashritha marriage at Rajasthan

విక్ట‌రీ వెంక‌టేష్‌కి ఇటీవ‌ల విడుద‌లైన‌ ఎఫ్‌2 అనే చిత్రం మంచి విజ‌యాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే. అదే ఉత్సాహంతో చైతూతో క‌లిసి వెంకీ మామ అనే మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే కొద్ది రోజులుగా వెంకీ కూతురు ఆశ్రిత పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించ‌డం లేదు.

ఫిబ్ర‌వ‌రిలో ఆశ్రిత ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవ‌డు వినాయ‌క్ రెడ్డితో మ‌ణికొండ‌లో జరిగింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇక తాజాగా వారి వివాహం రాజ‌స్థాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. డెస్టినేష‌న్ వెడ్డింగ్‌గా జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం స‌న్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు మాత్ర‌మే హాజ‌రు కానున్నార‌ని అంటున్నారు. ఈ వారంలోనే ఆశ్రిత‌, వినాయ‌క్‌ల వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, ఇప్ప‌టికే అన్నీ ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని తెలుస్తుంది. వివాహానికి ముందు జ‌రిగే సంగీత్ వేడుక‌లో నాగ‌చైత‌న్య- స‌మంత స్పెష‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌నున్నార‌ని టాక్‌. అంతా సీక్రెట్‌గా తన కూతురి వివాహం జ‌రుపుతున్న వెంకీ త‌ర్వాతనైన ఓపెన్ అవుతారా అనేది చూడాలి.

32058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles