‘ఏబీసీడీ’ ట్రైలర్‌ విడుదల

Mon,April 15, 2019 10:43 AM
ABCD - American Born Confused Desi Theatrical Trailer

హైదరాబాద్: అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశి’ అనేది ట్యాగ్ లైన్‌. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించారు. సంజీవ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా విడుదలకు సిద్ధం కాగా.. చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత మాస్టర్ భరత్ నటిస్తుండగా.. నాగబాబు, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌బెన్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు. మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేసింది.

1034
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles