మోదీ, జగన్‌కు మహేశ్ బాబు శుభాకాంక్షలు

Fri,May 24, 2019 03:16 PM
actor mahesh babu says congratulations to Modi and YS Jagan

హైదరాబాద్ : రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి, తొలిసారిగా సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్న వైఎస్ జగన్‌కు సినీ నటుడు మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సాధించిన జగన్‌కు మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. మీ పదవి కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో గొప్ప విజయాలను సాధిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు మహేశ్ బాబు.


2062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles