ప్ర‌తినాయ‌క పాత్ర‌లో నాని.. షాక్‌లో ఫ్యాన్స్ !

Sat,March 16, 2019 11:52 AM
Actor Nani plays negative role in Indraganti movie

అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన నాని ప్ర‌స్తుతం హీరోగా, నిర్మాత‌గా, హోస్ట్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సంవ‌త్స‌రానికి రెండు మూడు సినిమాల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న నాని వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్నాడు. ప్ర‌స్తుతం జెర్సీ చిత్రంతో బిజీగా ఉన్నాడు నేచుర‌ల్ స్టార్. ఈ చిత్రాన్ని మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నాడు. మ‌రోవైపు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా 2019లోనే విడుద‌ల కానుంది. అయితే త‌నని అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేసిన ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోను నాని ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఇంద్ర‌గంటి తెర‌కెక్కించ‌నున్న చిత్రం మ‌ల్టీ స్టార‌ర్ మూవీగా రూపొంద‌నుండ‌గా ఇందులో సుధీర్ బాబు కూడా మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తాడ‌ట‌. ఇక క‌థానాయిక‌గా నాని స‌ర‌స‌న అదితిరావుని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మ‌రో ప్ర‌చారం జ‌రుగుతుంది. సుధీర్ బాబు పోలీస్ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, నాని ప్ర‌తి నాయ‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ట‌. నాని పాత్ర పూర్తిస్థాయి నెగెటివ్ పాత్ర అయిన‌ప్ప‌టికి పాత్ర‌కున్న బ‌లం వ‌ల‌న ఈ యంగ్ హీరో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని అంటున్నారు. దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ సినిమాకు అమిత్‌ త్రివేది లేదా మణిశర్మల‌లో ఒకరిని సంగీత దర్శకుడిగా ఎంపిక చేయ‌నున్న‌ట్టు టాక్.

2646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles