మాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్న స్టార్ హీరో

Sun,April 30, 2017 11:50 AM

ఇళయదళపతి విజయ్ కి కేవలం తమిళంలోనే కాక అటు తెలుగు ఇటు మలయాళంలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హీరో జిజో ఆంటోని తెరకెక్కించిన పొక్కిరి సిమన్ చిత్రంలో కామియో రోల్ పోషించాడని తెలుస్తుంది. త్వరలోనే విడుదల కానున్న ఈ మాలీవుడ్ మూవీకి జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయని, విజయ్ కూడా కేరళకి వెళ్లి స్వయంగా ఈ ప్రమోషన్ లో పాల్గొంటాడని సమాచారం. అంతేకాక చిత్రంలోని నటీనటులందరితో కలిసి కాసేపు సరదాగా గడపనున్నట్టు టాక్. మరి ఈ వార్తలే నిజమైతే విజయ్ కి పొక్కిరి సిమన్ అనే మలయాళ చిత్రం డెబ్యూ మూవీ అవుతుంది. ప్రస్తుతం విజయ్ తమిళంలో అట్లీ దర్వకత్వంలో తన 61వ సినిమా చేస్తున్నాడు. ఇందులో జ్యోతిక, సమంత, కాజల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

1137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles