ఇక సినిమాల‌లో న‌టించ‌న‌ని తేల్చేసిన హేమ‌

Wed,July 17, 2019 10:30 AM
Actress Hema says good bye to film industry

తెలుగు సినిమాల‌లో అత్త‌గా, అక్క‌గా, భార్య‌గా, వదిన‌గా ఇలా ప‌లు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించి మెప్పించిన న‌టి హేమ‌. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో అల‌రించిన హేమ గ‌తంలో నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలో చేరి ఆ పార్టీకి త‌న వంతు ప్ర‌చారం చేశారు. అయితే తాను ఇక సినిమాల‌కి గుడ్ బై చెప్పి పూర్తి రాజ‌కీయాల‌లోనే ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు మీడియాతో తెలిపింది హేమ‌. రాజ‌మండ్రిలో ఇల్లు క‌ట్టించుకున్న‌ట్టు తెలిపిన ఆమె అది పూర్తి కాగానే, సినిమా ప‌రిశ్ర‌మ‌ని వదిలి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నట్టు ప్రకటించారు. బిగ్ బాస్ వివాదంపై కూడా మాట్లాడిన హేమ‌.. మంచి కుటుంబం నుండి వ‌చ్చిన నాగ్‌.. వివాదం ఉంటే ఆయ‌న బిగ్ బాస్‌లోకి రారు. ఒక‌వేళ బిగ్ బాస్‌లో ఏదైన త‌ప్పు జ‌ర‌గుతుంద‌ని తెలిస్తే నేనే నిల‌దీస్తాను అని పేర్కొంది.

3511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles