ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన రమ్యకృష్ణ ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర ఆమె కెరీర్‌ని అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్న రమ్యకృష్ణ ఇప్పుడు రొమాంటిక్ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుంది. ఆమె పాత్ర చిత్రానికి కీలకంగా మారనుందని అంటున్నారు. తాజాగా రమ్యకృష్ణ సెట్లోకి అడుగుపెట్టింది. చిత్ర నిర్మాత ఛార్మితో రమ్య ముచ్చటిస్తున్న ఫోటో ఒకటి తాజాగా విడుదల చేశారు. ఇందులో ఇద్దరు చాలా సీరియస్ డిస్కస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. పూరీ జగన్నాథ్ నిర్మాణంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రానికి అనీల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు మకరంద్ దేశ్ పాండే, మందిరాబేడీ కీలకపాత్రలో నటిస్తున్నారు.