షాకింగ్ లుక్‌లో ఒకప్పటి టాప్ హీరోయిన్

Mon,September 16, 2019 05:24 PM

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సిమ్రాన్ టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. తెలుగులో అగ్ర హీరోలందరితోనూ ఆమె నటించింది. ఈ క్రమంలోనే ఆమె నటించిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కేవలం తెలుగులోనే కాక పలు దక్షిణాది చిత్రాల్లోనూ సిమ్రాన్ నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఒకప్పుడు ఆమె ఎంత గ్లామరస్‌గా ఉండేదో.. ఇప్పుడుకు అందుకు పూర్తి భిన్నంగా కనిపించి అభిమానులందరికీ షాక్ ఇచ్చింది. తన లేటెస్ట్ ఫొటోను సిమ్రాన్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫొటోలో సిమ్రాన్‌ను చూసిన వారు అవాక్కవుతున్నారు. ఒకప్పుడు గ్లామర్‌కి కేరాఫ్‌గా నిలిచిన సిమ్రాన్ ఇప్పుడు ఇలా మారిందేమిటబ్బా అని సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2003లో సిమ్రాన్ వివాహం అయినా ఆమె పలు తెలుగు చిత్రాల్లో నటించింది. ఇక ఆమె ఇప్పుడు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. గత కొంత కాలం క్రితమే ఆమె నటుడు రజినీకాంత్‌తో కలిసి పెట్ట సినిమాలో నటించగా.. రాకెట్రీ, షుగర్ అనే మరో రెండు తమిళ సినిమాల్లో ప్ర‌స్తుతం నటిస్తోంది.

View this post on Instagram

Auto ride ❤️❤️❤️❤️

A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) on

3245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles