జెర్సీ నుండి 'అదేంటో గాని' వీడియో సాంగ్ విడుద‌ల‌

Wed,May 15, 2019 08:48 AM
Adhento Gaani Vunnapaatuga VIDEO SONG RELEASED

వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగించే నాని న‌టించిన తాజా చిత్రం జెర్సీ. మ‌ళ్ళీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుద‌ల అయింది. ఈ చిత్రానికి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. సినీ ప్ర‌ముఖులు కూడా ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యంగా నాని క్రికెట‌ర్‌గా అద‌రగొట్టాడ‌ని చెప్పుకొచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ కథానాయికగా న‌టించింది. అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని సమకూర్చారు. ఆయ‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన ప్ర‌తి సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించింది.

జెర్సీ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషించాడు. 36ఏళ్ల వయసులో అర్జున్ క్రికెట్‌లో తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన పరిస్థితులేమిటన్నది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించారు . 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడిచింది. సత్యరాజ్, రోనిత్‌కర్మ, బ్రహ్మాజీ తదితరులు నటించిన‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా సను వర్గీస్ ప‌నిచేశారు. తాజాగా చిత్రం నుండి అదేంటో గాని ఉన్న‌పాటుగా అనే సాంగ్ వీడియోని విడుద‌ల చేశారు . ఈ పాట‌కి అనిరుధ్ సంగీతం అందించ‌డ‌మే కాకుండా ఆల‌పించ‌డం విశేషం. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. మీరు ఈ సాంగ్‌పై ఓ లుక్కేయండి.

836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles