త‌మిళ అర్జున్ రెడ్డి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat,June 15, 2019 08:24 AM
Adithya Varma  first look released

తెలుగులో భారీ విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని త‌మిళంలో బాల తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ అనే టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో ఈ సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసి, సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్నారు. ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019, జూన్‌లో ఈ విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ తెలిపిన విష‌యం విదిత‌మే. ఒరిజిన‌ల్ వ‌ర్షెన్‌కి సంగీతం అందించిన ర‌ధ‌న్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా ర‌వి కె చంద్రన్ ప‌ని చేస్తున్నారు. ధృవ్ విక్ర‌మ్‌ స‌ర‌స‌న అక్టోబ‌ర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఆదిత్య వ‌ర్మ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ధృవ్ రెండు లుక్స్‌ని పోస్ట‌ర్‌లో చూపించారు. ఓవైపు సిగరెట్ తాగుతూ భారీ గ‌డ్డంతో ఉన్న ఆదిత్య వర్మ.. మరోవైపు క్లీన్ షేవ్‌తో హ్యాండ్‌సమ్ లుక్‌లో ఉన్నాడు. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 16న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా న‌టిస్తుంది.


2768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles