అర్జున్ రెడ్డి త‌మిళ రీమేక్ విడుద‌ల‌కి టైం ఫిక్స్..!

Thu,August 8, 2019 01:39 PM
Adithya Varma  gets release date

తెలుగులో మంచి హిట్‌ సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీతో పాటు త‌మిళంలో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇక త‌మిళంలో ద‌ర్శ‌కుడు బాల.. వ‌ర్మ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఈ సినిమా ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసి, సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్నారు. ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019, జూన్‌లో ఈ విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ అప్ప‌ట్లో తెలిపింది.

ఆదిత్య‌వ‌ర్మ చిత్ర రిలీజ్‌కి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి. కాని దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న భారీ సంఖ్య‌లో విడుద‌ల కానుంద‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌టన రానుంది. ఈ చిత్రానికి ర‌ధ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా ర‌వి కె చంద్రన్ ప‌ని చేస్తున్నారు. ధృవ్ విక్ర‌మ్‌ స‌ర‌స‌న అక్టోబ‌ర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

1084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles