త‌మిళ అర్జున్ రెడ్డి విడుద‌ల కాన‌ట్టేనా ?

Fri,July 5, 2019 11:42 AM
Adithya Varma movie gets still problems

తెలుగులో భారీ విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీతో పాటు త‌మిళంలో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. త‌మిళంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. అస‌లు త‌మిళ అర్జున్ రెడ్డి చిత్రం ముందుగా బాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ అనే టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో ఈ సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసి, సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్నారు. ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019, జూన్‌లో ఈ విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ తెలిపింది. కాని ఈ చిత్రం కూడా విడుద‌ల కావ‌డం క‌ష్ట‌మని అంటున్నారు.

ఆదిత్య‌వ‌ర్మ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ఈ చిత్ర క‌థ ధృవ్‌కి అస్స‌లు కాలేద‌ని భావిస్తున్నార‌ట మేక‌ర్స్‌. సినిమా స‌రిగా రాక‌పోవ‌డానికి కార‌ణం ద‌ర్శ‌కులు కాద‌ని , హీరోనే అని రెండో వ‌ర్షెన్ తీసే వ‌ర‌కి అర్దం చేసుకోలేక‌పోయార‌ట మేక‌ర్స్. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకి ఖ‌ర్చైన మొత్తాన్ని విక్ర‌మ్ నిర్మాత‌ల‌కి తిరిగి ఇచ్చి సినిమాని ల్యాబ్ కే పరిమితం చేయాలని అనుకుంటున్నాడ‌ట‌. మ‌రి ఇందులో నిజమెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది. చిత్రానికి ర‌ధ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా ర‌వి కె చంద్రన్ ప‌ని చేస్తున్నారు. ధృవ్ విక్ర‌మ్‌ స‌ర‌స‌న అక్టోబ‌ర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా , దీనికి మంచి రెస్పాన్సే వ‌చ్చింది.

1959
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles