అర్జున్ రెడ్డి రీమేక్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Tue,October 22, 2019 12:04 PM

తెలుగులో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీతో పాటు త‌మిళంలో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇక త‌మిళంలో ద‌ర్శ‌కుడు బాల.. వ‌ర్మ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఈ సినిమా ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసి, సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రీమేక్ చేసారు. ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 8న విడుద‌ల చేయ‌నున్నారు.


నిన్న చెన్నైలో చిత్ర ఆడియో వేడుక జ‌రుగగా, ర‌ధ‌న్ స‌మ‌కూర్చిన బాణీలు విడుద‌ల చేశారు. ఇవి సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ఇక కొద్ది సేప‌టి క్రితం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ధృవ్‌కి తొలి చిత్రం అయిన‌ప్ప‌టికి వివిధ స‌న్నివేశాల‌లో అద్భుతంగా న‌ట ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చాడు. ప్రేమ‌లో ఫెయిల్ అయిన వ్య‌క్తిగా ధృవ్ ప‌ర్‌ఫార్మెన్స్ సూప‌ర్భ్ అని చెప్పాలి. త‌మిళంలోను ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ర‌వి కె చంద్రన్ ప‌ని చేశారు. ధృవ్ విక్ర‌మ్‌ స‌ర‌స‌న అక్టోబ‌ర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా న‌టించింది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా న‌టించింది.

2337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles